సీఎం జగన్ సంచలన నిర్ణయం.. టీటీడీ కొత్త చైర్మన్‌గా..

టీటీడీ కొత్త చైర్మన్ గా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి వైవీ తనకు రాజ్యసభ సీటు కావాలని అడిగారు. అయితే ఆ విషయం తర్వాత చూస్తామని, ప్రస్తుతానికి టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవాలని జగన్ చెప్పినట్టు సమాచారం.
వైవీ సుబ్బారెడ్డి వైసీపీ సీనియర్ నేత కాకుండా, సీఎం జగన్‌కు చిన్నాన్న అవుతారు. జగన తల్లి విజయమ్మ చెల్లెలు స్వర్ణలత భర్త సుబ్బారెడ్డి. ఎంబీఏ చదివిన ఆయన 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా మొన్నటి ఎన్నికల్లో వైవీకి సీటు ఇవ్వలేదు జగన్. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com