సఫారీలపై అదరగొడుతోన్న బూమ్రా

By - TV5 Telugu |5 Jun 2019 12:35 PM GMT
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు. సౌతాంప్టన్ వేదికగా మొదలైన పోరులో బుమ్రా ధాటికి సౌతాఫ్రికా జట్టు ఓపెనర్లు క్రీజులో నిలవలేకపోయారు. బుమ్రా వరుస ఓవర్లలో ఆమ్లా, డికాక్‌లను ఔట్ చేసి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.
ఆ తర్వాత డుప్లెసిస్, వాండుర్సెన్ నిలకడగా ఆడినప్పటకీ.. భారీ పార్టనర్‌షిప్ నమోదు చేయలేకపోయారు. వీరిద్దరినీ స్పిన్నర్ చాహల్ ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 80 పరుగులకు 4 వికెట్లు చేజార్చుకుంది. 89 పరుగుల వద్ద డుమిని వికెట్ తీసాడు కుల్దీప్. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com