నాన్నా.. వద్దు ప్లీజ్ అన్నా వినకుండా.. భార్య కళ్ల ముందే కూతుర్ని..

నాన్నా.. వద్దు ప్లీజ్ అన్నా వినకుండా.. భార్య కళ్ల ముందే కూతుర్ని..

ఎదిగిన కూతురు ఆ తండ్రి కళ్లకు ఎలా కనిపించిందో. ఆకతాయిల చూపులు కూతురి కంటి మీద పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి చూపులు.. కన్న బిడ్డ పైనే కన్నేశాయి. కనిపెంచిన బిడ్డన్న కనికరం లేకుండా కట్టుకున్న భార్య ముందే కూతురిపై అత్యాచారం చేసి తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణాన్ని సహించలేని భార్య అడ్డుకుందని ఆమెని కొట్టి చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కుమారి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిజయ బెహరాకు భార్య, కూతురు ఉన్నారు. కూతురిపై కన్నేసిన తండ్రి అవకాశం కోసం చూస్తున్నాడు. ఓ రోజు కూతురికి మాయ మాటలు చెప్పి ఆమెని తీసుకుని దగ్గరలోని కొండ ప్రాంతానికి వెళ్లాడు. కీడు శంకించిన భార్య అతడిని వెంబడించింది. కొండపైకి వెళ్లాక నీచుడైన ఆ తండ్రి కూతురిపై అత్యాచార యత్నం చేశాడు.

భార్య అతడి చర్యలకు అవాక్కై అడ్డగించింది. కోరికతో రగిలిపోతున్న అతడికి భార్య అడ్డుతగలడంతో ఆగ్రహానికి గురయ్యాడు. విచక్షణా రహింతంగా ఆమెను కొట్టడంతో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరణించిన భార్యని అక్కడే వదిలేసి కూతురిని రేప్ చేసి పరారయ్యాడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు కొండపైకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. తండ్రే హంతకుడని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో గాలింపు చర్యలు చేపట్టారు. కేరళకు పారిపోయాడని తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story