తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందించిన ఉత్తమ్

తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందించిన ఉత్తమ్

నల్గొండ ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన అసెంబ్లీ సీటుకు ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది.

తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉత్తమ్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సీటుకు ఆరు నెలల్లో బైపోల్‌ జరుగుతుంది. అయితే.. సీటును కాంగ్రెస్‌లో ఎవరికి ఇస్తారు అనేది గాంధీభవన్‌లో, జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తమ్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి టికెట్ దక్కొచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. జానారెడ్డి కూడా ఫోకస్ చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తనకు గానీ.. తన కుమారుడికి కానీ.. ఆ టికెట్ ఇవ్వాలని జానారెడ్డి కోరుతున్నట్టు సమాచారం. అటు.. టీఆర్ఎస్‌ నుంచి ఎవరు బరిలో దిగుతారనేది ఉత్కంఠ రాజేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story