కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

కీలక వడ్డీరేట్ల తగ్గిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ కాసేపటి క్రితమే ప్రకటించింది. రెపో రేటు పావు శాతం తగ్గింది. తాజా తగ్గింపుతో రెపో రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. రెపో రేటు తగ్గింపునకు తొలిసారిగా ఆరుగురు సభ్యులు గల ఎంపీసీ సమావేశంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఇక ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్‌ రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి ఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేస్తే లభించే రివర్స్‌ రెపో రేటు సైతం 5.75 శాతం నుంచి 5.5 శాతానికి పరిమితంకానుంది.

Tags

Next Story