వామ్మో.. 16 ఏళ్లకే ఎంత హైటో.. కారణం తెలిస్తే..

వామ్మో.. 16 ఏళ్లకే ఎంత హైటో.. కారణం తెలిస్తే..

తనకంటే ఎత్తు ఎదిగిన కొడుకుని చూస్తే ఏ తండ్రికైనా సంతోషమే. మరి ఈ కొడుకుని చూసి ఆ తండ్రి కన్నీరు పెడుతున్నాడు. బ్రెయిన్‌లోని ట్యూమర్ కారణంగానే కొడుకు అంత ఎత్తుకి ఎదిగిపోతున్నాడని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌లో 12వ తరగతి చదువుతున్నాడు మోహన్ సింగ్. 113 కిలోల బరువు 7.4 అడుగుల ఎత్తులో ఉన్న మోహన్‌ని చూసి ఫ్రెండ్స్ హేళన చేసేవారు. ఆగకుండా పెరుగుతున్న కొడుకు హైట్‌ని గురించి ఆందోళన చెందిన తండ్రి ఓ రోజు హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాడు అతడిని. డాక్టర్లకు అనుమానం వచ్చి బ్రెయిన్ స్కాన్ చేయాలన్నారు. వచ్చిన రిపోర్టులు చూస్తే మోహన్ బ్రెయిన్‌లో గడ్డ (బ్రెయిన్ ట్యూమర్) పెరుగుతుందని తెలుసుకున్నారు.

దానికి హైట్‌కి సంబంధం ఏంటని విచారిస్తే..

మెదడులోని చాలా ముఖ్యమైన గ్రంథిలో పిట్యూటరీ గ్రంథి ఒకటి. ఇది ఎదుగుదలను నియంత్రించే గ్రోత్ హర్మోన్‌ని విడుదల చేస్తుంది. కానీ మోహన్‌కి పిట్యూటరీ గ్రంథిలోనే ట్యూమర్ వచ్చి అసాధారణ రీతిలో హైట్ పెరిగాడని డాక్టర్లు చెబుతున్నారు. ఎయిమ్స్ డాక్టర్లు చికిత్స చేసి ముక్కు నుంచి ఎండోస్కోపీ ద్వారా ట్యూమర్‌ని తొలగించారు. గడ్డను తొలగించాక గ్రోత్ హార్మోన్ స్థాయి తగ్గినట్లు చెప్పారు. అరుదుగా కనిపించే ఇలాంటి కేసుల్లో గుండెకు ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు.

వరల్డ్ రెజ్లింగ్ క్రీడాకారుడు ద గ్రేట్ ఖలీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కున్నాడు. చిన్నప్పుడు ఎత్తు పెరిగిపోతుండడంతో చెక్ చేయించారు తల్లిదండ్రులు. అతడిక్కూడా పిట్యూటరీ గ్రంధిలో పెద్ద గడ్డ కనిపించిందట. ఆ తర్వాత ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు. ప్రపంచంలోనే 8.3 అడుగులతో అతి పొడవైన వ్యక్తిగా రికార్డులకెక్కిన సుల్తాన్ కోసెన్ కూడా ఇదే సమస్యతో బాధపడేవాడు.

Tags

Next Story