సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్
ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌పై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుండీ ఆధిపత్యం ఇరు జట్ల చేతులూ మారింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఒక దశలో భారీస్కోర్ చేసేలా కనిపించినా... కివీస్ బౌలర్లు 244 పరుగులకే కట్టడి చేశారు. అయితే ఛేజింగ్‌లో న్యూజిలాండ్ తడబడింది. ఓపెనర్లు త్వరగానే ఔటవగా... విలియమ్సన్, టేలర్ రాణించారు. చివర్లో వీరిద్దరూ ఔటయ్యాక మ్యాచ్ ఉత్కంఠగా మారింది. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా లేకపోవడంతో టెయిలెండర్లు కివీస్‌ను గెలిపించారు. బంగ్లా బౌలర్లు గొప్పగా పోరాడడంతో కివీస్ 2 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది. ఓడినప్పటకీ.. బంగ్లాదేశ్ ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com