25 మందితో ఫుల్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్

25 మందితో ఫుల్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్

శనివారం జరిగే ఏపీ మంత్రి వర్గ విస్తరణ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయం11గంటల 49 నిమిషాలకు సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కొత్త మంత్రులు. జగన్ కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కనుంది, సామాజిక సమీకరణాలు ఎవరికి మినిస్టర్ పదవి మోసుకొస్తుందనే ఆసక్తి నెలకొంది. మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఆశావహులు ఉత్కంఠ కనిపిస్తోంది.

శనివారం 25 మందితో ఫుల్ క్యాబినెట్ ను సీఎం జగన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలనును బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్ కూర్పు జరిగినట్లు తెలుస్తోంది. ఈ 25 మందిలో అత్యధికంగా ఏడుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి చోటు దక్కనుంది. ఇక కాపు సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గానికి రెండు మంత్రి పదువులు దక్కబోతున్నాయి.

బీసీ కులాల నుంచి ఆరుగురికి కేబినెట్ అవకాశం కల్పించేలా జగన్ మంత్రివర్గ కూర్పు జరిగినట్లు తెలుస్తోంది. మాల సామాజిక వర్గం నుంచి ఇద్దరు, మాదిక సామాజిక వర్గం నుంచి ఒకరు ఎస్టీ నుంచి ఒకరికి మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక క్షత్రియ సామాజిక వర్గానికి ఈ సారి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. ముస్లిం మైనార్టీ నుండి ఒకరికి, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలకు చెరో మంత్రి పదవి ఇవ్వనున్నారు జగన్.

మరోవైపు... ఈ నెల 8న ఉదయం 11 గంటల 49 నిమిషాలకు జరగబోయే మంత్రివర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రుల ప్రమాణం రోజునే జగన్ సచివాలయానికి రానున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ సచివాలయానికి తొలిసారిగా వస్తుండటం..మంత్రివర్గం ప్రమాణం ఉండటంతో ఏర్పాట్ల తగిన సూచనలు చేశారు.

వివిఐపిలు, విఐపిలతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు, ప్రజలు వారికి కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఆయా మార్గాలలో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈకార్యక్రమానికి సుమారు 5వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎంట్రీ పాస్‌ ఉన్న వారిని మాత్రమే ప్రాంగణంలోకి అనుమతిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story