కాళ్లు చేతులు కట్టేసి దారుణంగా..

కాళ్లు చేతులు కట్టేసి దారుణంగా..

రాజస్థాన్‌లో ఓ దళిత యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఆలయంలోకి ప్రవేశించాడన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.రాజస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. దళిత యువకుడిని కాళ్లు చేతులు కట్టేసి అమానుషంగా చితకబాదారు. పాలీ జిల్లా ధనేరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. : గ్రామానికి చెందిన కొందరు యువకులు, ఆ యువకునిపై దాడి చేశారు. అతని కాళ్లు చేతులు కట్టేసి కర్రలతో చితక బాదారు. ఓ నెటిజన్‌ వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

దళిత యువకుడిని మిగిలిన యువకులు చితకబాదారు. కొట్టొద్దని మొత్తుకున్నా వినలేదు. అసలు ఎందుకు దాడి చేశారనే అంశంపై క్లారీటీ లేదు. కొందరేమో బాధితుడు, హిందూ దేవాలయంలోకి ప్రవేశించాడని, అది చూసి అగ్రవర్ణ పెద్దలు కోపంతో దాడి చేశారంటున్నారు. దళితుడు కాబట్టి ఆలయంలోకి ప్రవేశం లేదంటున్నారు. కానీ గుడిలోకి వచ్చేందుకు ప్రయత్నించడం వల్లే అడ్డుకున్నట్లు తెలిపారు. దురహంకారంతో కొందరు యువకులు, సదరు యువకున్ని ఇష్టం వచ్చినట్లు కొట్టారని చెప్తున్నారు.

ఐతే, , ఓ అమ్మాయిని లైంగికంగా వేధించినందుకే కొట్టామంటున్నారు స్థానికులు .మైనరత్‌తో అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడికి తెగబడ్డారనే వాదన వినిపిస్తోంది. ఆ యువకుడికి బుద్ది చెప్పామమంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.అయితే దళిత యువకుడిపై దాడి చేసిన వ్యక్తి కషాయ కండువా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ, దాన్ని అనుబంద సంస్థల ప్రోత్సహంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story