1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు అనర్హులు

1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు అనర్హులు

శుక్రవారం మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. 7న తొలుత కో ఆప్షన్‌ సభ్యుల నామినేషన్ల స్వీకారం, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ పదవులకు ఎన్నికలుంటాయి. ఒక్కో ఎంపీపీ పరిధిలో ఒక్కో కోఆప్టెడ్‌ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగనున్న మొత్తం 538 ఎంపీపీల్లో మహిళలకు 269 స్థానాలు దక్కనున్నాయి.

రేపు నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఇవాళ ఉదయం 11 గంటలలోపు రాజకీయ పార్టీలు విప్‌ల నియామకానికి సంబంధించిన లేఖను, ఫామ్‌–ఎను ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ లేఖతోపాటు విప్‌ జారీచేసే వ్యక్తి గుర్తింపు కార్డుతోపాటు ఆధారిత లేఖ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పత్రాన్ని ఇవాళ అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి నుంచి విప్‌ అధికారం పొందిన వ్యక్తి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చేయి ఎత్తే పద్ధతిలో ఎవరికి ఓటేయాలన్న దానిపై సభ్యులకు విప్‌ జారీచేస్తారు.

మరోవైపు ఎంపీపీ, జెడ్పీపీ లలో కో–ఆప్టెడ్‌ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల ఉండకూడదు అనే నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉన్న నియమాలన్నీ కో–ఆప్టెడ్‌ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. శుక్రవారం ఎంపీపీ లు, శనివారం జెడ్పీపీలలో కో–ఆప్టెడ్‌ సభ్యుల ఎన్ని క జరగతుంది. 1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు కో–ఆప్టెడ్‌ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనర్హులు కానున్నారు.

Tags

Next Story