మాజీ ప్రధాని ఇంటిని అమిత్ షాకు కేటాయించిన ప్రభుత్వం

మాజీ ప్రధాని ఇంటిని అమిత్ షాకు కేటాయించిన ప్రభుత్వం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటిని ప్రభుత్వం కేటాయించింది. 6-ఎ కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న ఈ ఇంటిలో వాజ్‌పేయి తుదిశ్వాస విడిచే వరకు నివసించారు. గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ప్రస్తుతం షా 11 అక్బర్ రోడ్డులో నివసిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా, హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు పెద్ద బంగళా కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన వాజ్ పేయి నివశించిన ఇంటిని కోరినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ కమిటీ కూడా కేటాయించినట్టు లేఖ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story