ఎంతైనా ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియానే!

ఎంతైనా ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియానే!

ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‎మెన్స్ చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే ఐదు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాథన్, కల్టర్ నైల్ 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేయగా, స్టీవెన్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 45 పరుగులతో అద్భుతంగా రాణించారు. దీంతో ఆసీస్ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 289 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన విండీస్ జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 273 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్, లూయిస్ వెంటనే అవుట్ కావడంతో విండీస్ ఆటగాళ్లకు కష్టాలు తప్పలేదు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ హోప్ 68, నికోలస్ పురన్ 40, హోల్డర్ 51 పరుగులు చేశారు. ఆసీస్ బౌలింగ్‎లో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags

Read MoreRead Less
Next Story