ధోనీ వాడిన గ్లోవ్స్‌పై చెలరేగుతోన్న వివాదం

ధోనీ వాడిన గ్లోవ్స్‌పై చెలరేగుతోన్న వివాదం
X

మొన్నటి సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనీ వాడిన గ్లోవ్స్‌పై వివాదం చెలరేగింది. ధోనీ ధరించిన గ్లోవ్స్‌పై ఐసీసీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఎంఎస్‌ ధోనీ కీపింగ్‌ గ్లోవ్స్‌ మీదున్న భారత భద్రతా దళాలకు సంబంధించిన చిహ్నాన్ని తీసివేయాలని బీసీసీఐని కోరింది ఐసీసీ. దీంతో ధోనీ ధరించిన గ్లోవ్స్‌పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

2011లో టెరిటోరియల్‌ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్‌ హోదా పొందిన ధోనీ..ప్రత్యేక భద్రతా దళాలకు గౌరవ సూచకంగా...ఆ బలాల ఆత్మ బలిదాన చిహ్నం బాకును తన కీపింగ్‌ గ్లోవ్స్‌పై వేయించుకున్నాడు. ఈ నెల 5న సౌతాఫికాతో మ్యాచ్‌ సందర్భంగా ధోనీ గ్లోవ్స్‌పై బలిదాన్ చిహ్నాన్ని గుర్తించిన ఐసీసీ..దానిని తీసేవేయాలని బీసీసీఐకి సూచించింది.

గ్లోవ్స్‌పై ఆత్మబలిదాన్‌ చిహ్నం పెట్టుకోవడం ద్వారా ధోనీ తన దేశ భక్తిని చాటుకున్నాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. గ్లోవ్స్‌పై ఆ గుర్తు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ధోనీకి సహచర ఆటగాళ్లు, వివిధ క్రీడా ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ధోనీ గ్లోవ్స్‌ విషయంలో ఐసీసీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story