చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద.. ఆగివున్న లారీని జైలో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులంతా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారు. తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story