7 Jun 2019 11:07 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఎంతకు తెగించారు..పాపం...

ఎంతకు తెగించారు..పాపం గే కపుల్‌ను దారుణంగా

ఎంతకు తెగించారు..పాపం గే కపుల్‌ను దారుణంగా
X

విధులను ముగించుకుని ఇంటికి వస్తున్న గే జంటపై కొందరు యువకులు దాడి చేశారు, ఈ దాడిలో వారికి తీవ్ర గాయలయ్యాయి. ఉరుగ్వే దేశానికి చెందిన మెలానియా గీమోనా అనే ఉద్యోగి తన అమెరికన్ స్నేహితురాలు క్రిస్‌తో కలిసి లండన్‌ నగరంలో బస్సులో ప్రయాణిస్తున్నసమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై మెలానియా స్పందించారు .’ మేము బస్సులో కూర్చొని రాత్రి సమయంలో నగర అందాలను వీక్షిస్తున్నాం. మా వెనకాల ఉన్న కొందరు యువకులు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ముద్దు పెట్టుకోవాలంటూ లైంగికంగా వేధించారు. అనంతరం నా పక్కన ఉన్న క్రిస్‌ను..నన్ను ముద్దు పెట్టడానికి ప్రయత్నించారు. మేము వారిని అడ్డుకున్నాం. దీంతో వారు కోపంతో మాపై దాడికి దిగారు. వారంతా దాదాపు 20 నుంచి 30 ఏళ్ళ వయస్సు ఉన్నవారు. ముందుగా క్రిస్‌ను గుంపులోకి లాగి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. నేను వారిని అడ్డుకున్నాను దీంతో వారు నన్ను,క్రిస్‌ను రక్తం వచ్చేలా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మా బట్టలు రక్తంతో తడిసిపోయాయి'

అని మెలానియా తెలిపారు.

ఈ సంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు యువుకులు తమపై దాడి చేశారని వారిలో ఒకరు స్పానిష్ మాట్లాడగా మిగతా వారు బ్రిటీష్ యాక్సెంట్‌లో మాట్లాడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. వారి తమ దగ్గర ఉన్న వస్తువులను కూడా దోచుకువెళ్లారని పోలీసులకు వివరించారు. దాడిలో గాయపడినప్పుడు తీసిన ఫోటోలను కూడా మెలానియా బయటపెట్టారు. దీన్నో అమానుష చర్యగా ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన గత నెలలో చోటుచేసుకోగా అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story