ఈ ఎన్నికల్లో అది నిరూపితమైంది : పవన్ కళ్యాణ్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటమిపై రివ్యూ చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. గురువారం మంగళగిరిలో ఆయన పార్టీ నేతలతో సమీక్షా సమవేశం జరిపారు. ఈ ఓటమి తమకు ఓ అనుభవన్నారాయన. నాలుగేళ్ల పార్టికీ లక్షలాదిమంది ఓటు వేయడాన్ని ఓ విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే పార్టీని ఎదగనీయకుండా.. కొన్ని బలమైన శక్తులు పనిచేయడం వల్లే ఓడిపోయామన్నారు...
జనసేనకు బలమైన క్యాడర్‌తో పాటు జనబలం కూడా ఉందని... ఈ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు పవన్ కల్యాణ్. ఆ బలాన్ని పార్టీ కోసం వినినియోగించడమే ప్రస్తుత కర్తవ్యమని నేతలకు సూచించారు. తుది శ్వాస ఉన్నంత వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికి సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయామన్నారు పవన్..
ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయవ్యవహారాల కమిటీ కాల పరిమితి ముగియడంతో కొద్దిరోజుల్లోనే కొత్త కమిటిని నియమిస్తామన్నారు పవన్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మరో కమిటీ కూడా నియమిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, ప్రణాళికలు అభ్యర్ధుల ఎంపి వంటివాటిపై దృష్టిపెడతామన్నారు పవన్ కల్యాణ్.
మరోవైపు... పార్టీ భావజాలం నిర్ణయాలు, ప్రణాళికల్ని కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఓ పక్షపత్రిక తీసుకురావాలని నిర్ణయించారు జనసేన అధినేత. ఈ పత్రిక ఎలా ఉండాలన్నదానిపై ఓ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ పత్రికలో రాష్ట్ర దేశ, విదేశాలకు చెందిన పాలసీలు, నిర్ణయాలు, అభివృద్ధి రంగాలకు చెందిన ఉంటుందన్నారు. పత్రిక తొలి ప్రతిని సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com