7 Jun 2019 10:11 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / రాత్రికి రాత్రే...

రాత్రికి రాత్రే బ్రిడ్జి మాయం

రాత్రికి రాత్రే బ్రిడ్జి మాయం
X

వంతెన పోయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఏకంగా రాత్రికి రాత్రే ఓ బ్రిడ్జి మాయం అయిపోయింది. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఉంబా నదిపై నిర్మించిన వంతెనలో సగం మాయమైంది. మొదట ప్రకృతి వైపరీత్యాల కారణంగా బ్రిడ్జి పాడైపోయి ఉంటుందని భావించారు.కానీ ఆ తర్వాతే తెలిసింది అసలు విషయం. ఇది దొంగల పని. ఏకంగా వంతెననే లేపుకెళ్లారు దుండగులు.

ఈ బ్రిడ్జి నిర్మాణంలో వాడిన ఉక్కు చాలా విలువైనది. అందుకే దానిపై కన్నేశారు దొంగలు. వారి చేతివాటం కారణంగా 75 అడుగుల పొడవు, 56టన్నుల బరువున్న ఈ వంతెన ఇప్పుడు రూపు లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియోలు రష్యన్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వంతెనలోని మధ్య భాగాన్ని కూల్చేసి అందులో ఉన్న ఇనుమును దోచుకెళ్లారు దొంగలు. ఇది దొంగల పనే అని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ బ్రిడ్జిని ఒకప్పుడు రైల్వే మార్గం కోసం వినియోగించారు. అయితే దీని పక్కనే మరో వంతెనను నిర్మించడంతో ఇది నిరుపయోగంగా ఉంది. ఇదే అదునుగా ఏకంగా బ్రిడ్జినే దోచుకెళ్లారు దుండగులు.

Next Story