మరికొన్ని గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

మరికొన్ని గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
X

మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 9న అలప్పుళా, కొల్లాం జిల్లాలు, 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈనేపథ్యంలో ఆప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని .. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారాదని హెచ్చరించింది.

ఉత్తరాది రాష్ట్రాల్లో మరో వారం రోజల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ , విదర్భ , ఉత్తరప్రదేశ్‌ల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 3,4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Tags

Next Story