ఆ పదవి కోసం వారికి రూ. 2 కోట్లు ఆఫర్ ?

ఆ పదవి కోసం వారికి రూ. 2 కోట్లు ఆఫర్ ?
X

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ MPP చైర్మన్ పదవి కోసం బేరసారాలు మొదలయ్యాయి. చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన పార్టీల నేతలు MPTC సభ్యులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో శంషాబాద్ MPP పదవి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

శంషాబాద్ లోని 12 MPTC స్థానాల్లో TRS 6 స్థానాలు గెలవగా, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది. మిగిలిన నాలుగు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. TRS పార్టీకి చైర్మన్ గిరి దక్కాలంటే మరో సభ్యుడి మద్దతు అవసరం. అటు కాంగ్రెస్ నేతలు కూడా స్వతంత్రుల మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలట్ ఆనందర్ రెడ్డి MPP పీఠాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోస్టు ఆశిస్తున్న TRS, కాంగ్రెస్ లు.. ఇండిపెండెంట్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఓ పార్టీ నేతలు కోటి రూపాయలతోపాటు కారు కూడా గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు. అవతల వాళ్లుకూడా ఏకంగా రూ. 2 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఎవరికివారు స్వతంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. బేరసారాలు జోరుమీద ఉండటంతో... MPP చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. కో-ఆప్షన్ సభ్యుడి పదవి కోసం కాంగ్రెస్, TRS పార్టీల నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో.. ఆ పోస్టు ఎన్నిక కూడా హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story