టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ!

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ!

తెలంగాణ ఎంపీపీ ఎన్నికలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ను అడ్డుకునేందుకు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్‌ మద్దతుతో బీజేపీ రంగారెడ్డి జిల్లాలో రెండు ఎంపీపీ పదవులను సొంతం చేసుకుంది. మహేశ్వరం నియోజకవర్గ పరధిలోని కందుకూరు ఎంపీపీగా బీజేపీకి చెందిన మందా జ్యోతిగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీలు ఉంటే.. బీజేపీ -7, టీఆర్‌ఎస్‌- 6, కాంగ్రెస్‌ - 1, ఇతరులు- రెండు ఎంపీటీసీ స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్‌, ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ ఎంపీపీని కైవసం చేసుకుంది.

అటు ఇబ్రహీపట్నం నియోజకవర్గం యాచారంలోనూ ఇదే పరిస్థితి. యాచారం మండలంలోని 14 ఎంపీటీసీల్లో బీజేపీ కేవలం రెండు చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కు చెరో ఐదుగురు ఎంపీటీసీలు ఉన్నారు. ఇండిపెండెంట్లు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్న బీజేపీకి కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. దీంతో యాచారం ఎంపీపీ పదవి అనూహ్యంగా బీజేపీ వశమైంది.

Tags

Read MoreRead Less
Next Story