ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం నియమితులు కబ్స్లోతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కలిసిన తమ్మినేనికి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. అయితే స్పీకర్ రేసులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావులు ఉన్నప్పటికీ సీఎం జగన్ తమ్మినేని వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది.
కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఐదుసార్లు ఆముదాలవలస నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు టీడీపీ నుంచి ఒకసారి స్వతంత్రంగా తాజాగా వైసీపీనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 9ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన కాళింగ సామాజిక వర్గానికి కీలక పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com