తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి : ఉత్తమ్‌

తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి : ఉత్తమ్‌

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై ఇవాళ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. హైకోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టు, లోక్‌పాల్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారాయన. కేసీఆర్‌ ముఖ్యమంత్రైన తర్వాత తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని విమర్శించారు ఉత్తమ్‌. తన కోసం తన కుటుంబం కోసం ప్రజాసామ్యవ్యవస్థల్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ వైఖరికి నిరసనగా.. ఈ నెల 9 నుంచి నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామన్నారు ఉత్తమ్‌

Tags

Read MoreRead Less
Next Story