ఉపాసన సరికొత్తగా.. ఆ హీరోతో..

ఉపాసన సరికొత్తగా.. ఆ హీరోతో..

అపోలో హాస్పిటల్స్ చైర్మన్ మనవరాలిగా, మెగా స్టార్ కోడలిగా ఆల్‌రెడీ సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకున్నారు ఉపాసన. సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. ఫుడ్ అండ్ హెల్త్‌కి సంబంధించి పలు సూచనలు, జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి 'బిపాజిటివ్' అనే మ్యాగజైన్‌ని నడిపిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది ఉపాసన. ఇకపై ఈ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో ప్రేక్షకుల ముందుంచాలని ఆమె నిర్ణయించుకున్నారు.

'బిపాజిటివ్ విత్ ఉపాసన' పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి సెలబ్రిటీల తాజా ఇంటర్వ్యూలను అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని ఇంటర్వ్యూ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఉపాసన.. మీ ఆరోగ్య రహస్యాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్యూ సల్మాన్ జీ. ఆయనలోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం అని ట్యాగ్ చేశారు. ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్‌ని కట్ చేసి ఓ షార్ట్ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో అతిత్వరలోనే యూట్యూబ్ చానెల్‌లో ప్రసారం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story