క్రైమ్

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమించిన యువకుడు.. చివరకు..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమించిన యువకుడు.. చివరకు..
X

ఓ యువతిని ఓ యువకుడు ప్రేమించి మోసం చేసిన ఘటన సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. హైదరాబాద్‌లోని ఓప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని వాణి.. జెర్రి అనే యువకుడి ప్రేమలో పడింది. వీరిద్దరూ కలసి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు. అయితే.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు మాత్రం జెర్రి అంగీకరించడం లేదు. దీంతో..వాణి తనకు న్యాయం చేయాలంటూ తన కుటుంబ సభ్యులతో కలసి వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ప్రియుడు జెర్రి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తమ ప్రేమకు గుర్తుగా తాము తీయించుకున్న ఫొటోలు తన దగ్గర ఉన్నాయని వాణి చెబుతోంది. తాను క్రిష్టియన్‌ అయినందు వల్లే జెర్రి తనను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదని వాణి చెబుతోంది. తనను తన ప్రియుడు జెర్రీ పెళ్లి చేసుకుంటే అతని ఇంట్లో పనిమనిషిగానైనా ఉండేందుకు సిద్దమని వాణి అంటోంది. అయితే.. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన జెర్రీ.. గతంలో ప్రేమ పేరుతో పలువురు యువతులను మోసగించాడని వాణి ఆరోపిస్తోంది.

Next Story

RELATED STORIES