ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం?

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని అన్నారు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. త్వరలోనే విలీన ప్రక్రియ ప్రారంభం అవుతుందని భరోసా ఇచ్చారు. దీనిపై అధ్యయనం చేసేందుకు మూడు రోజుల్లో కమిటీ వేస్తామన్నారు. ప్రభుత్వం వేయబోయే కమిటీలో మాజీ వైస్ చైర్మన్, ఎండీతో పాటు ప్రిన్స్ పాల్ సెక్రటరీ, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారని వివరించారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని అన్నారు కృష్ణబాబు. ఈ నెల 10న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కృష్ణబాబు ఆధ్వర్యంలో సీఎం జగన్‌ను కలవనున్నారు.
ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో కృష్ణబాబు చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్లతో పాటు ఆర్టీసీ బలోపేతంపై చర్చించారు. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు సంస్థలో కార్గో వ్యవస్థను బలోపేతం చేస్తామని కృష్ణబాబు అన్నారు. RTC ఉద్యోగులందరికీ NGOల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆర్టీసి ఉద్యోగులకు కూడా NGOల మాదిరిగా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచుతామన్నారు కృష్ణబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com