ATM లో క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

ATM లో క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

ATM లో క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా. తస్మాత్ జాగ్రత్త. డిపాజిట్ మెషిన్ల దగ్గరమాటువేసి జనాల్ని అప్పనంగా దోచుకుంటున్నారు. ఇలా విజయవాడలో పలు ATM వద్ద అమాయకుల్ని బురిడీ కొట్టించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ మాయగాడిపేరు ఇంటిపల్లి రామారావు. బీటెక్ చదివి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీ మనీ కోసం మోసాలు చేయడం ప్రారంభించాడు.

ATM మెషిన్లలో డిపాజిట్ చేసే వాళ్లే రామారావు టార్గెట్. మాటలు కలిపి ఎంత డిపాజిట్ చేస్తారో కనుక్కుంటాడు. మొబైల్ ద్వారా ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేస్తానని డబ్బులు నమ్మబలుకుతాడు. క్యూ నిల్చొనే ఓపికలేనివారు ఇతని మాయమాటలకు పడిపోతారు. NEFT ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తాడు. డబ్బు ట్రాన్స్ ఫర్ అయినట్టు మెసేజ్ రాగానే అవతలివాళ్లు డబ్బు ఇచ్చేస్తారు. ఇక్కడే రామారావు తెలివి వాడతాడు. NEFT లో ట్రాన్స్ ఫర్ చేసిన అరగంటలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాన్ని ఆసరాగాతీసుకుని రామారావు డబ్బులు దోచుకుంటాడు. ఇలా రామారావుపై 21 కేసులు నమోదయ్యాయి. సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ మోసగాడిని పట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story