నేతల్లో ఎడతెగని ఉత్కంఠ.. పదవుల కోసం తెరాసలో పోటాపోటీ

తెలంగాణ వ్యాప్తంగా జడ్పీ పీఠం ఎవరదన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో జడ్పీ చైర్మన్ల ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జడ్పీ పీఠం దక్కించుకునేందుకు టిఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. అనిల్ జాదవ్, రాథోడ్ జనార్థన్‌లు కుర్చీ కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇవాళ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో శిబిరాల్లో ఉన్న సభ్యులు ఎటువైపు మొగ్గుచూపుతారో అనే ఉత్కంఠ ఆదిలాబాద్‌లో నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లాలో 17 జడ్పీటీసీ స్థానాల్లో 9 టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు చెరో మూడు సీట్లు నెగ్గాయి. మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకున్న టిఆర్‌ఎస్ జెడ్‌పీటీసీ పీఠం దక్కించుకోనుంది. అయితే ఇందు కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఉత్కంఠ పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com