Home
 / 
అంతర్జాతీయం / భారత్‌ను వేడుకుంటున్న...

భారత్‌ను వేడుకుంటున్న పాకిస్థాన్

భారత్‌ను వేడుకుంటున్న పాకిస్థాన్
X

ప్లీజ్... మాతో చర్చలు జరపండి.. మమ్మల్ని మీతో కలుపుకోండి.. ఒక్కసారి సమావేశమవుదాం... ప్లీజ్... ప్లీజ్... ఇదీ దాయాదిదేశం పాకిస్థాన్ వైఖరి. ఇంటా బయటా పూర్తిగా చితికిపోవడంతో పాకిస్థాన్ తీరు మారి పోయింది. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోదీకి మళ్లీ లేఖ రాశారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మళ్లీ శాంతి చర్చలు జరిగేలా చూడాలంటూ మోదీని అభ్యర్థించారు.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలకు భారత ప్రభుత్వం గుడ్ బై చెప్పింది. ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నిర్మూలించేవరకు పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని మోదీ సర్కారు తేల్చి చెప్పింది. అలాగే, వచ్చే వారం కిర్గిస్థాన్‌లో జరిగే షాంఘై సహకార సదస్సులో ఇమ్రాన్ ఖాన్‌-మోదీ మధ్య ఎలాంటి సమావేశం ఉండబోదని స్పష్టం చేసింది. షాంఘై సదస్సులో భారత్-పాక్ అధినేతల మధ్య చర్చలు ప్రసక్తికి అవకాశమే లేదని కుండబద్దలు కొట్టింది.

భారత ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్‌ ప్రభుత్వం షాక్ తింది. చర్చలకు నో చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు, మరోసారి ఆలోచించాలంటూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిపై కూడా సర్కారు సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

Next Story