బావిలో పడ్డ చిరుతపులి.. బయటకు వచ్చి..

బావిలో పడ్డ చిరుతపులి.. బయటకు వచ్చి..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం రాజూరాలో ఓ చిరుతపులి వ్యవసాయ బావిలో పడడం కలకలం రేపింది. ఆహారం కోసం గ్రామశివార్లలోకి వచ్చిన చిరుత.. వ్యవసాయ బావిలో పడిపోయింది. ఉదయం పొలం దగ్గరికి వచ్చిన రైతులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిరుతను చూసి... ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. చిరుతపులిని బయటకు తీసేందుకు అనేక విధాల ప్రయత్నించారు. చివరికి ఓ పొడవాటి నిచ్చెన తయారు చేసి బావిలోకి దింపారు. చిరుత ఆ నిచ్చెన సహాయంతో బయటకు వచ్చి.. అడవిలోకి పరుగు తీసింది. బావిలో పడ్డ చిరుతను చూసేందుకు చుట్టుపక్కల జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story