అత్త మీద కోడలు ప్రతాపం.. వీడియో షేర్ చేసిన సీఎం

అత్త మీద కోడలు ప్రతాపం.. వీడియో షేర్ చేసిన సీఎం

హరియానాలో అత్త మీద కోడలు తన ప్రతాపం చూపించింది. వృద్దురాలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాదింది. ఈ వీడియోను హరియానా సీఎం షేర్ చేశారు. ఇదెక్కడి దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన పోలీసులు కోడలును అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహేంద్రగర్‌లో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మహేంద్రఘడ్‌కు జిల్లాకు చెందిన కంటా బాయీ భర్త,అత్తతో కలిసి ఉంటోంది. ఆమె డబ్బు కోసం తరుచూ అత్త చాంద్‌ బాయీనివేధించేది. చాంద్‌ బాయీ భర్త సరిహద్దు భద్రతా బలగాల విభాగంలో ఎస్సైగా పనిచేసేవాడు. అతడి మరణానంతరం ఆమెకు ప్రభుత్వ పెన్షన్‌ వస్తోంది. 80 ఏళ్ళ వయస్సు ఉన్న చాంద్‌ బాయీ వయోభారంతో బాధపడుతోంది. ఆమె పెన్షన్‌ డబ్బుల కోసం కంటా బాయీ.. అత్తను వేధించేది. ఈ క్రమంలో పక్కింట్లో ఉన్న ఓ విద్యార్థిని ఆ వృద్దురాలను కొడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Tags

Next Story