వారిద్దరికీ ఉపముఖ్యమంత్రి పదవి దక్కడం ఖాయం

తన మంత్రివర్గంలో... ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. సామాజికవర్గాల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు..ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ఇలా ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించడం దేశ చరిత్రలోనే మొదటి సారి. అయితే ఈ ఐదుగురు ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

ఎస్టీ,మైనార్టీల నుంచి కేబినెట్‌లో ఒక్కొక్కరికి మాత్రమే చోటు దక్కింది. పుష్ప శ్రీవాణి, అంజాద్‌ బాషాలకు ఉపముఖ్యమంత్రి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీసీ,ఎస్సీ,కాపుల్లో ఎవరికి ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. కాపు కోటాలో ఏలూరు నుంచి ఎన్నికైన ఆళ్ల నానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ విషయానికి కొస్తే.. పత్తిపాడు నుంచి ఎన్నికైన మేకతోటి సుచరితకు అవకాశం దక్కే చాన్స్‌ ఉంది. బీసీల్లో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోదిదేవి వెంకటరమణల్లో ఒకరికి లేదా సీనియర్‌ ఎమ్మెల్యేల్లో బొత్స సత్యనారాయణకు డిప్యూటీ సీఎం పదవి దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇవాళ మొత్తం 25 మంది మంత్రులుగానే ప్రమాణం చేస్తారు. . అయితే వారికి శాఖలు కేటాయిస్తూ జారీ చేసే ఉత్త్వరుల్లో మాత్రం ఉపముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తారు. వాస్తవానికి రాజ్యంగంలో డిప్యూటీ సీఎం పదవి లేదు. ఏకంగా ఐదుగురుకి ఉపముఖ్యమంత్రి హోదా కల్పించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. సామాజిక వర్గాలావారిగా సమప్రాధాన్యత కల్పించిన ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story