గడ్డం పెంచుకుంటున్న మోదీ, అమిత్ షా.. ఫాలో అవుతున్న..

వారిద్దరిది ఒకే మాట .. ఒకే బాట. బీజేపీని రెండో సారి అధికారంలోకి తీసుకురావడంతో వారికి వారే సాటి. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు అమిత్ షాలది విడదీయరాని బంధం. ఇద్దరి మధ్య పలు అంశాల్లో పోలికలు ఉన్నాయి. ప్రభుత్వంలోనూ , పార్టీలోనూ వారిదే తుది నిర్ణయాధికారం. ఆరెస్సెస్‌తో సుదీర్గ అనుబంధం, దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను అనుసంధానం చేయడంలోనూ, పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటంలో ఇద్దరిలోనూ ఉమ్మడి లక్షణాలు కన్పిస్తుంటాయి. మోదీ, అమిత్షాల్లో మరో ఆసక్తికరమైన అంశం ఇద్దరూ ఎంతో ఇష్టంగా గడ్డం పెంచుకోడవం . ఇది వారిద్దరి మధ్య సారూప్యతకు అద్దంపడుతుంది.
అటు మోదీ ప్రభుత్వంలో కొలువుదీరిన కేబినెట్లో ఇదే పోలికలు ఉన్నాయి. గడ్డం పెంచడమే ఓ ట్రెండ్‌గా మారింది. మొత్తం 58 మంది మంత్రుల్లో ప్రధాని మోదీ సహా 18 కేంద్ర మంత్రులు ఎంతో ఇష్టంగా గడ్డం పెంచేవాళ్లే . కేంద్ర మంత్రి వర్గంలో ఇంతమంది గడ్డం పెంచేవారు ఉండటం ఇదే తొలిసారి. వారిలో పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, మైనార్టీ వ్యవహారాలమంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయ్శంకర్, పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాసవాన్ ఉన్నారు.
అటు స్వతంత్ర హోదాలో విమానయాన మంత్రి హర్దీప్ పూరీ, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్, సహాయ మంత్రుల్లో కిషన్‌రెడ్డి, అశ్వనీ చౌబె, కృష్ణపాల్ గుర్జర్, పురుషోత్తం రూపాలా, రాందాస్ అథవాలే, బాబుల్ సుప్రియో, అనురాగ్ ఠాకుర్, ప్రతాప్ చంద్ర షడంగీలు ఇష్టంగా గడ్డం పెంచుకుంటున్నారు. అయితే ఇలా గడ్డం పెంచడం వెనుక మోదీ అనుసరించడంలేదని ఇది యాదృచ్ఛికమైన అంశమేనని దీని వెనుక ప్రత్యేక కారణాలు ఏమీ లేవని తోసిపుచ్చుతున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com