విషాదం.. 19 మంది చిన్నారులు మృతి

బిహార్ లోని ముజఫర్ పూర్ లో చిన్నారుల మృత్యుఘోష కనిపిస్తోంది. మెదడువాపు వ్యాధితో 19 చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ వ్యాధితో డజన్ల కొద్దీ పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకృష్ణ మెమోరియల్ కాలేజ్ హాస్పిటల్ లో 38 పిల్లలు చేరగా 15 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు పిల్లలు మరణించారు.
అధిక వేడి, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నపుడు శరీరంలో చమట బయటికిరాదు. గత కొన్నిరోజులుగా బిహార్ 50 శాతానికిపైగా గాల్లో తేమ నమోదవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన జ్వరం లక్షణాలతో మెదడువాపు వ్యాధి వస్తుంది. ముజఫర్ పూర్ లాంటి ప్రాంతాల్లో ప్రతిఏటా వేసవిలో ఈ వ్యాధి వస్తున్నప్పటికీ... ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిల్లలు బలవుతున్నారు. 15 ఏళ్లలోపు ఉన్న పేదల పిల్లలే ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. పిల్లల చావుకు జిల్లా అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. వైద్య అధికారులు సరైన సమయంలో స్పందించలేదని, వ్యాధిని త్వరగా గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com