వైద్యుల నిర్వాకం.. పురిటినొప్పులతో వచ్చిన మహిళను..

వైద్యుల నిర్వాకం.. పురిటినొప్పులతో వచ్చిన మహిళను..

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మానాపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళకు నెలలు నిండంతో పురిటినొప్పులతో ఆసుపత్రికి వెళ్ళేందుకు సిద్దమయ్యింది. ఇంతలో భారీగా కురిసిన వర్షాలకు లింగాల-అచ్చంపేట మ‌ధ్యలో ప్రవహించే చంద్రవంక వాగులో వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. దీంతో చేసేదేమి లేక పురుటినొప్పులను సైతం లెక్కచేయకుండా కుటుంబసభ్యుల సహాకారంతో నిండు గర్భిణి స్వప్న వాగును దాటి నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి చేరింది.

అయితే అక్కడి వైద్యులు, సిబ్బంది ఆమెను పట్టించుకోకపోగా... వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సూచించారు. దీంతో చేసేదేమి లేక అక్కడి నుంచి ప్రైవేటు అంబులెన్స్ లో ఆసుపత్రికి చేరుకున్న ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె,శిశువు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే పురిటి నొప్పులతో వచ్చిన నిండు గర్భినిని పట్టించుకోకపోగా... నిర్లక్ష్యంగా ఆమెను 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ కు వెళ్ళమని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story