చదివేది ఇంజినీరింగ్.. చేసేది స్మగ్లింగ్..

కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మారిపోవడం కలకలం రేపుతోంది. విశాఖ నుంచి గంజాయి తెప్పించి.. బెజవాడ.. పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నామని బయటకు ఫోజు కొట్టినా.. వీరు చేస్తున్నది మాత్రం పక్కా స్మగ్లింగ్. ఉంగుటూరు, గన్నవరం మండల ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తుండగా.. విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ అదుపులో ఉన్న 10 మందిలో ఆరుగురు బీటెక్ విద్యార్థులే.. వీరు అరకు నుంచి నేరుగా గంజాయి తెప్పించి కాలేజీల్లో అమ్ముతుంటారు. బెజవాడలోని ఐదు కాలేజీల్లో.. గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో పట్టుబడ్డ బీటెక్ విద్యార్థుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అటు.. నాలుగు నెలల కిందట నలుగురు బీటెక్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినా.. వారు తమ నడత మార్చుకోలేదు. మళ్లీ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. ఐతే.. నేరుగా గంజాయి అమ్మేవారితో విద్యార్థులకున్న సంబంధాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
RELATED STORIES
Bihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు...
12 Aug 2022 9:01 AM GMTJammu Kashmir Encounter : ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం.....
11 Aug 2022 3:15 PM GMTMamatha Benerjee : మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు అరెస్ట్..
11 Aug 2022 2:21 PM GMTUP Boat Accident : యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి
11 Aug 2022 1:00 PM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTJagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం..
11 Aug 2022 8:00 AM GMT