తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న మోదీ
BY TV5 Telugu9 Jun 2019 4:32 AM GMT

X
TV5 Telugu9 Jun 2019 4:32 AM GMT
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకొని రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ ఇవాళ తిరుమలేషుని దర్శించుకోనున్నారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటన ముగించుకొని సాయంత్రం 4.30కు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు ప్రధాని మోదీ. ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4.40 గంటలకు బీజేపీ కార్యకర్తలతో మోదీ సమావేశం అవుతారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన తిరుమల చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి, తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. మోదీకి ఘనస్వాగతం పలుకుతూ భారీ కటౌట్లను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
Next Story