రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తా..ఏపీకి ప్రధాని మోదీ హామీ

ఏపీ అభివృద్ధితో మరోసారి హామీలు..సంపూర్ణ సహకారం అందిస్తామంటూ భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రజల మనసు గెలుచుకోవాలంటూ తిరుపతి బహిరంగసభలో కార్యకర్తలకు హితబోధ చేశారాయన. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శ్రీలంక నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రాయినికి చేరుకున్నారు ప్రధాని మోదీ. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతిలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల బహిరంగసభకు హజరైన మోదీని రాష్ట్ర నేతలు సన్మానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ..ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మనస్సులను గెలుచోవటమే లక్ష్యంగా శ్రమించాలని హిదబోధ చేశారు. ఇక ఏపీ ప్రజలకు అభివృద్ధిపై మరోసారి హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలకు తగ్గట్లు రాష్ట్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. జగన్ నాయకత్వంలో శక్తివంతమైన ప్రభుత్వం ఉందని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని అన్నారు.
శ్రీవారి సన్నధిలో తొలి బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ప్రసంగించారు. ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం అందించిన ప్రజలకు.. బాలాజీ పాద పద్మాల సాక్షిగా కృతజ్ఞతలు అంటూ ప్రసంగించటం కార్యకర్తల్లో హుషారు నింపింది. బహిరంగసభ తర్వాత నేరుగా ఆయన తిరుమల క్షేత్రానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. పద్మావతి గెస్ట్ హౌజ్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ముందుగా వరహాస్వామి దర్శనం చేసుకున్నారు మోదీ. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత మోదీకి తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు. ప్రధాని ప్రర్యటనతో తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత తిరుమల నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రం వెళ్లిన మోదీ అక్కడ్నుంచి ఢిల్లీ వెళ్లారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com