నన్ను భీమవరంలో ఓడించేందుకు .. - పవన్

జనసేన పార్టీని ఒక్క ఓటమి ఆపలేదన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌. పరాజయాన్ని అంగీకరించని తాను.. గెలిచేవరకూ పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసేందుకు వచ్చిన వివిధ జిల్లాల కార్యకర్తలతో ముచ్చటించారు. తన జీవితం రాజకీయాలకే అంకితమన్నారు. దెబ్బ తగిలే కొద్దీ ఎదిగే వ్యక్తినని.. 25 ఏళ్లు లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా.. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తానన్నారు. తనను ఓడించేందుకు భీమవరంలో 150 కోట్లు ఖర్చు చేశారని.. పవన్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వరాదన్నది వారి లక్ష్యం అన్నారు. ప్రజా తీర్పును గౌరవిద్దామని.. వైసీపీ పాలన ఎలా ఉంటుందో చూద్దామని వ్యాఖ్యానించారు.

Tags

Next Story