ఏపీ కేబినెట్‌.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం కొనసాగింది. మేనిఫెస్టోలో పెట్టిన పలు హామీలకు ఆమోదం తెలిపారు. వృద్ధాప్య పింఛన్లు 2 వేల 250 రూపాయలకు, ఆశా వర్కర్ల జీతాలు 3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. రైతు భరోసా పథకానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపుకు కూడా అంగీకరించారు.

ఇక ఉత్కంఠ రేపుతున్న ఆర్టీసీ విలీనానికి కూడా కేబినెట్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్టు సమాచారం.

Tags

Next Story