పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు

పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు
X

సుపరిపాలన అందించడం కోసం పంచాయితీరాజ్ మున్సిపల్ చట్టాలను సవరించుకుంటూ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం వున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం కార్యాచరణ , నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పన పై ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పననుంచి గ్రామాల్లో పచ్చదనం పరిశ్రుభ్రత తో పాటు ఇతర మౌలిక రంగాల అభివ్రద్దికి చేపట్టాల్సిన బాధ్యతను సీఎం మంత్రులకు గుర్తుచేశారు. మున్సిపాలిటీలు దినదినాభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మేలయిన పాలన అందించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలన్నారు.

అటు విద్యాశాఖ అధికారులతో కూడా కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈనెల 17న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.

Tags

Next Story