కథువా రేప్ కేసులో పఠాన్‌కోట్ కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కథువా రేప్ కేసులో పఠాన్‌కోట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై హత్యాచారం కేసులో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. ఇందులో ముగ్గురికి జీవితఖైదు విధించింది. మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సాంజీరామ్ కుమారుడు విశాల్‌కు విముక్తి లభించింది. ఘటన జరిగిన సమయంలో విశాల్ మీరట్‌లో పరీక్షలు రాస్తున్నట్లుగా రుజువు కావడంతో అతణ్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
కథువా ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. 2018 జనవరి 10న రసనా గ్రామంలోని బకర్వాల్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయిం ది. వారం రోజుల తర్వాత బాలిక మృతదేహం కనిపించడంతో ఆందోళన చెలరేగింది. అమ్మాయిని దారుణంగా రేప్ చేసి, హతమార్చారని పోస్టుమార్టం రిపోర్టులో బయటపడడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తా యి. కేసుపై విచారణ జరిపిన జమ్మూ కశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, తొలుత 8 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇక, పఠాన్‌కోట్ కోర్టులో దాదాపు ఏడాదిపాటు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, సాంజీరామ్ సహా ఆరుగురిని దోషులుగా తేల్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com