కథువా రేప్‌ కేసులో పఠాన్‌కోట్‌ కోర్టు తీర్పు..ఆరుగురిని..

కథువా రేప్‌ కేసులో పఠాన్‌కోట్‌ కోర్టు తీర్పు..ఆరుగురిని..

జమ్మూకాశ్మీర్‌లో సంచలనం సృష్టించిన కథువా రేప్‌ కేసులో పంజాబ్‌ పఠాన్‌కోట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. త్వరలో నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది పఠాన్‌ కోర్టు న్యాయ స్థానం.

జమ్మూకాశ్మీర్‌లో 2018 జనవరిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అభం శుభం తెలియని చిన్నారి అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హతమార్చారు దుండగులు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు ఏడాదిన్నర పాటు విచారించిన కోర్టు.. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది.

Tags

Read MoreRead Less
Next Story