ఇలా చేస్తే అసెంబ్లీలో ఆదానీలు...అంబానీలే ఉంటారు: కోదండరామ్

ఇలా చేస్తే అసెంబ్లీలో ఆదానీలు...అంబానీలే ఉంటారు: కోదండరామ్

నిమ్స్‌ ఆస్పత్రిలో మల్లు భట్టి విక్రమార్క దీక్ష కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు. 3 రోజుల దీక్ష కారణంగా భట్టి శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో.. అత్యవసరంగా చికిత్స చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. సెలైన్ పెట్టించుకునేందుకు నిరాకరిస్తుండడంతో ఆయనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు వైద్యులు. అటు భట్టిని.. టీజేఏస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరామర్శించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనుకోవడం టీఆర్ఎస్‌ భ్రమ అన్నారు. డబ్బుతో నాయకులను కొంటామని కేసీఆర్ అనుకుంటున్నారని... ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు భట్టి విక్రమార్క.

ఫిరాయింపు చట్టం అమలు చేయాల్సిందేనన్నారు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌. స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న సీఎల్పీని... టీఆర్ఎస్‌లో ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు. పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే అసెంబ్లీలో ఆదానిలు...అంబానీలే ఉంటారన్నారు కోదండరామ్‌.... గెలిచిన వారు పార్టీ మారడం దారుణమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story