ఆంధ్రప్రదేశ్

పెళ్లి ఆపండి అంటూ సినిమాలో హీరోలా గట్టిగా అరిచాడు... చివరకు చూస్తే

పెళ్లి ఆపండి అంటూ సినిమాలో హీరోలా గట్టిగా అరిచాడు... చివరకు చూస్తే
X

కొన్ని సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాము. కానీ ఈ మధ్య చూస్తున్న వింత వింత సంఘటనలు సినిమాలను తలపిస్తున్నాయి. పెళ్లి అనేది నమ్మకంతో ముడిపడిన ఓ బధం. అనురాగం, ఆత్మీయతల కలబోతతో రెండు జీవితాలు ముడిపడతాయి. సంప్రదాయలకు విలువనిస్తూ పెద్దలు వారిద్దరికీ పెళ్లి చేయనిశ్చయించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టబోతున్న సమయంలో ఓ కుర్రాడు ఎంటరై నన్ను ప్రేమించి నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది అని పెళ్లి పందిట్లో బంధువులందరి ముందూ వధువుని నిలదీశాడు. దీంతో పీటల మీది పెళ్లి ఆగిపోయింది. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ అమ్మాయికి ఆస్ట్రేలియాలో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న అబ్బాయితో వివాహం చేయ నిశ్చయించారు పెద్దలు. ఇరు కుటుంబాలు ఆదివారం వీరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మంటపం అంతా హడావిడిగా ఉంది. కాసేపసట్లో జీలకర్ర బెల్లం పెట్టి.. వధువు మెడలో మూడు ముళ్లు వేయడానికి సిద్ధమవుతున్నాడు వరుడు. ఇంతలో సడెన్‌గా ఎక్కడినుంచో ఊడిపడ్డాడు ఓ కుర్రాడు. పెళ్లి ఆపండి అంటూ సినిమాలో హీరోలా గట్టిగా అరిచాడు. పెళ్లికి వచ్చిన పెద్దలంతా ఏంజరగబోతోందో అని ఆసక్తిగా గమనించసాగారు.

పెళ్లి కూతురు, తానూ ప్రేమించుకున్నామనీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని అన్నాడు. ఇదేం విడ్డూరమే తల్లి ఆ విషయం ముందే చెప్పొచ్చుగా అని పెళ్లి పెద్దలంతా ముక్కు మీద వేలేసుకున్నారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా చేస్తున్నారని అన్నాడు. ఈ పెళ్లి ఎలా చేస్తారో చూస్తానని అన్నాడు. దీంతో వరుడు షాకయ్యాడు. ఏంటి ఇదంతా అని వధువుని నిలదీశాడు. దానికి ఆమె అతనెవరో నాక్కూడా తెలియదు. ఇంతకు ముందెప్పుడూ నేను అతడిని చూడలేదు అని మొత్తుకున్నా వరుడు వినలేదు. సీరియస్‌గా పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లి పోయాడు. కుటుంబ సభ్యులు కూడా అతడి వెంటే వెళ్లిపోయారు. పీటల మీద పెళ్ల ఆపేసిన కుర్రాడిని పట్టుకుని ఆరా తీస్తే నంద్యాలకు చెందిన సురేష్ అని తెలుసుకున్నారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు వధువు కుటుంబసభ్యులు. తమ న్యాయం చేయాలంటూ కేసు పెట్టారు.

Next Story

RELATED STORIES