మనసున్న బిచ్చగాడు.. అడుక్కున్న సొమ్మంతా..

మనసున్న బిచ్చగాడు.. అడుక్కున్న సొమ్మంతా..

గుడి ముందు బిక్షాటన చేసుకునే బిచ్చగాడు తాను సంపాదించిన ఒక్కో రూపాయిని దాచి పెట్టి ఆలయ అభివృద్ది కోసం విరాళంగా ఇచ్చి తన మంచి మనసుని చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చేబోలు కామరాజు అరవై ఏళ్ల క్రితం ఏదైనా వ్యాపారం చేసుకుందామని విజయనగరం జిల్లా చీపురు పల్లికి వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో అతడి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అయిన వాళ్లంతా దూరమయ్యారు. ఒంటరి జీవితాన్ని ఆ దేవుని సన్నిధిలో గడిపేద్దామని ఆలయం ముందు యాచించడం మొదలు పెట్టాడు. భక్తులు వేసే చిల్లర నాణేలను కూడబెట్టాడు. ఆ విధంగా కూడబెట్టిన మొత్తాన్ని రూ.3 లక్షల ఐదు వేల రూపాయిలను ఏ గుడి అయితే తనకు ఆశ్రయం కల్పించిందో ఆ గుడి అభివ‌ద్ధికే విరాళంగా అందజేసాడు. ఇటీవల 30వేల రూపాయలు పట్టణంలోని రావివలస కూడలి సమీపంలోని భారీ ఆంజనేయస్వామి విగ్రహం భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి అందజేసాడు.

Tags

Next Story