టీనేజ్ అమ్మాయితో ఎమ్మెల్యే చిందులు.. కౌగిలింతలు..

టీనేజ్ అమ్మాయితో ఎమ్మెల్యే చిందులు.. కౌగిలింతలు..

వీళ్లనా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. అధికార దాహంతో అడ్డదారులు తొక్కి అక్రమంగా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని పదవిలోకి వచ్చే వరకు మీకోసమే నేను.. మీ బాధే నాబాధ అంటూ ప్రగల్భాలు పలికే నాయకులు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు చొంగలు కార్చుకునే ఎమ్మెల్యే బాగోతం బయటికి వచ్చింది. మణిపూర్‌లో ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్లిన ఎమ్మెల్యే హోటల్‌లోని రూమ్‌లో టీనేజీ అమ్మాయితో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 50 ఏళ్ల రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యే యదువన్ష్ కుమార్ యాదవ్ బీహార్ అసెంబ్లీ నియోజక వర్గంలో కీలక పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లిన ఎమ్మెల్యే అక్కడి ఓ హోటల్ రూమ్‌లో బస చేశారు. హోటల్ సిబ్బంది ఎమ్మెల్యేలు బస చేసిన గదికి ఓ టీనేజ్ అమ్మాయిని తీసుకు వచ్చారు. ఎమ్మెల్యే ఫుల్లుగా మందేసి ఆ అమ్మాయితో చిందేశారు. ఆమె భుజంపై చెయ్యేసి.. కౌగిలించుకుని డ్యాన్స్ చేశారు. ఎమ్మెల్యేతో డ్యాన్స్ చేయడం ఏ మాత్రం ఇష్టంలేని ఆ అమ్మాయి అతడిని వ్యతిరేకించింది. అయినా బలవంతంగా ఆమెను దగ్గరకు లాక్కుని చిందేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story