ఆంధ్రప్రదేశ్

ఫేస్‌బుక్ పోస్ట్ విషయంలో ఏపీ డీజీపీని కలిసిన యామిని

ఫేస్‌బుక్ పోస్ట్ విషయంలో ఏపీ డీజీపీని కలిసిన యామిని
X

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. గుర్తుతెలియని వ్యక్తులు తనపేరుతో నకిలీ పేస్ బుక్ పేజీని క్రియేట్ చేశారని.. అందులో తాను మోడీ, జగన్ ను తిడుతున్నట్టు పోస్ట్ చేశారని.. ఆ పోస్టుతో తనకెలాంటి సంబంధం లేదని.. ఇది నకిలీ పేజీ అని డీజీపీకి ఫిర్యాదు చేశారామె.. ఆ పేజీని క్రియేట్ చేసిన వారు ఎవరో తెలుసుకుని కఠినంగా శిక్షించాలని యామిని డీజీపీని కోరారు. కాగా ఆదివారం ప్రధాని మోదీ తిరుమల పర్యటన సందర్బంగా సీఎం జగన్ ను ఉద్దేశించి యామిని పేరుతో అసభ్యకర సందేశాన్ని పోస్ట్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ విషయం తెలుసుకున్న యామిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ పేజీని డిలీట్ చేశారు.

Next Story

RELATED STORIES