హోటల్లో సర్వర్లుగా మారిన బిలియనీర్స్

వాళ్లిద్దరూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. నిత్యం బిజీగా గడిపే మనుషులు. ఒక్క నిమిషానికి వారి ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఆ ఇద్దరూ సరదాగా సర్వర్లుగా మారిపోయారు. వాళ్లిద్దరే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్, బర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ అధినేత వారెన్ బఫెట్ .
ఒక్క క్షణం కూడా తీరిక ఉండని వీళ్లు... తీరిక చేసుకుని ఓ ఐస్‌క్రీం స్టోర్‌కు వెళ్లారు. ఒమాహాలో ఉండే ఓ ఫుడ్ స్టోర్లో సర్వర్లుగా మారిపోయారు. కస్టమర్లకు చల్లటి ఐస్‌క్రీం మరియు ఇతర ఫుడ్ ఐటెమ్స్ వడ్డించారు. బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశం అయ్యాక ఇద్దరు కలిసి భోజనం చేయాలని అనుకున్నారు. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఎక్కడైనా బయట రెస్టారెంట్‌లో భోజనం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు..అనుకున్నదే తడవుగా ఒక ఐస్‌క్రీం స్టోర్‌కు వెళ్లారు. అందులో రెస్టారెంటు కూడా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ధనికులు తమ హోటల్‌కు రావడంతో అక్కడి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అంతేకాదు వారు వేసుకునే యాప్రన్ తీసుకుని బిల్‌గేట్స్, వారెన్ బఫెట్‌లు ధరించగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.యాప్రన్‌లు ధరించి రంగంలోకి దిగారు బిల్ గేట్స్, బఫెట్‌లు... సర్వింగ్ చేయడమే కాదు అక్కడ కొన్ని ఐటెమ్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకుని గెరిటె తిప్పారు.ఈ వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
RELATED STORIES
Pawan Kalyan: అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ...
25 May 2022 12:30 PM GMTMLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టైనా హత్య కేసులో ఎన్నో...
25 May 2022 10:51 AM GMTKonaseema District: అమలాపురంలో కొనసాగుతున్న 144సెక్షన్.. మళ్లీ సాధారణ...
25 May 2022 9:00 AM GMTChandrababu: ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా...
24 May 2022 4:15 PM GMTKurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు ...
24 May 2022 3:54 PM GMTChandrababu: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ.. రైస్ మాఫియా...
24 May 2022 1:30 PM GMT