గబ్బర్.. సునామీ!..టీమిండియా దిమ్మతిరిగే పంచ్..

అంచనాలు తప్పలేదు...వేదిక మారినా ఫలితం మాత్రం అదే..టోర్నీలో కీఫైట్‌గా భావించిన పోరులో ఆసీస్‌పై టీమిండియదే పైచేయిగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీసేన 36 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌లో ధావన్,కోహ్లీ ఇన్నింగ్స్‌లు హైలెట్‌గా నిలిస్తే... బౌలింగ్‌లో పేస్ ద్వయం అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై కోహ్లీ సేన నెగ్గినా.. ఎక్కడో ఏదో తెలియని అనుమానం. కానీ, ఆసీస్‌పై టీమిండియా ప్రదర్శన ముందు ఆ అనుమానాలన్ని పటాపంచలయ్యాయి.
ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సౌతాఫ్రికాపై విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించిన కోహ్లీసేన క్లిష్టమైన మ్యాచ్‌గా భావించిన పోరులో ఆస్ట్రేలియాను నిలువరించింది. సమఉజ్జీల సమరంగా భావించినప్పటకీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఎక్కువ ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం... ఓపెనర్లు వ్యూహాత్మకంగా ఆడడం భారత భారీస్కోరుకు కారణంగా చెప్పొచ్చు. మొదటి 10 ఓవర్లు సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చిన ధావన్, రోహిత్ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడారు. రోహిత్ ఔటయ్యాక... ధావన్, కోహ్లీ భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా నడిపించారు. ఈ క్రమంలో మూడో ప్రపంచకప్ శతకం సాధించిన ధావన్... ఓవరాల్‌గా 17వ వన్డే సెంచరీ అందుకున్నాడు.
భారత ఇన్నింగ్స్‌లో చివరి 10 ఓవర్లు మరో హైలెట్‌గా చెప్పాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో పాండ్యాకు ప్రమోషన్ ఇవ్వడంతో స్కోర్ సునాయాసంగా 350 దాటింది. సిక్సర్లతో చెలరేగిన పాండ్యా 27 బంతుల్లోనే 48 పరుగులు చేయగా... ధోనీ 27 రన్స్‌కు ఔటయ్యాడు.
ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా కూడా భారత్ వ్యూహాన్నే అనుసరించినట్టు కనిపించింది. అయితే భారత బౌలర్లు వార్నర్, ఫించ్‌లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లు సింగిల్స్ తీసేందుకు కూడా ఇబ్బందిపడ్డారంటే మన బౌలర్లు ఎలా కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు.
మధ్యలో స్మిత్ , ఖవాజా పార్టనర్‌షిప్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరోసారి మన పేస్ ద్వయం పుంజుకోవడంతో భారత్ విజయానికి చేరువైంది. అంచనాలు పెట్టుకున్న మాక్స్‌వెల్ కూడా త్వరగానే ఔటవడంతో విజయం ఖాయమైంది. చివర్లో అలెక్స్ క్యారీ మెరుపు హాఫ్ సెంచరీ చేసినప్పటకీ.. ఫలితం లేకపోయింది.దీంతో ఆసీస్ జోరుకు బ్రేక్ వేసిన టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీలో గట్టి ప్రత్యర్థిగా భావించిన ఆసీస్‌పై విజయంతో టీమిండియా జోరుకు తిరుగులేనట్టేనని అభిమానులు భావిస్తున్నారు. ఓవరాల్‌గా స్థాయికి తగిన ఆటతీరుతో ఆకట్టుకుంటోన్న భారత్ టైటిల్ రేసులో దూసుకెళుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com