నలుగురు రైల్వే ప్రయాణికులను బలి తీసుకున్న..
By - TV5 Telugu |11 Jun 2019 2:53 PM GMT
ఎండవేడిమి నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రైల్లో ప్రయాణిస్తుండగానే, వేసవి తాపాన్ని తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ 65 ఏళ్లు దాటినవారే. వారణాసి, ఆగ్రాలను చూడడానికి వచ్చిన బృందంలో వీళ్లు కూడా ఉన్నారు. ట్రైన్ బయల్దేరిన కాసేపటికే ఎండవేడిమి భయంకరంగా పెరిగిపోయింది. ఆ దెబ్బకు నలుగురు వృద్ధులు అస్వసతకు లోనయ్యారు. ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వైద్యులు వచ్చి సాయం అందించేలోపే కుప్పకూలిపోయారు. మరో ప్రయాణికుడు కూడా తీవ్రంగా అనారోగ్యం పాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com